Amitabh Bachchan: ఫాలోవర్ల సంఖ్య 50 మిలియన్లకు పెంచేందుకు సలహా కోరిన అమితాబ్ 9 d ago

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో తరచూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ముఖ్యంగా 'ఎక్స్' లో తన అభిమానులతో తరచూ తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా, తన ఫాలోవర్ల సంఖ్య 49 మిలియన్లకు చేరిందని, దానిని 50 మిలియన్లకు పెంచేందుకు సలహాలు కోరుతూ ఓ పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్ లు సరదాగా స్పందిస్తూ, జయాబచ్చన్‌తో ఫొటోలు పంచుకోవాలని, రేఖతో సెల్ఫీ వేయాలని, విద్య, ఆరోగ్యం గురించి పోస్టులు పెట్టాలని కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులతో చాట్ చేయమన్నవారు కూడా ఉన్నారు.